Juvenile Home: జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్.. మంత్రి సీతక్క సీరియస్
ABN, Publish Date - Jul 25 , 2025 | 05:43 PM
సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని..
హైదరాబాద్, జులై 25: సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు సుపర్వైజర్లపై వేటు పడింది. జైలు సూపరింటెండెంట్ కు మెమో జారీ చేశారు. జువైనల్ హోమ్ బాలలు తప్పించుకుపోకుండా అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు.
ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయారు. ఈ ఘటనపై సచివాలయంలో మంత్రికి జువైనల్ వెల్ఫెర్ శాఖ అధికారులు నివేదిక సమర్పించారు. జువైనల్ వెల్ఫెర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రోబేషన్ సూపర్వైజర్ నవీన్ ఘటన వివరాలను మంత్రికి వివరించారు. తప్పించుకుపోయిన ఐదుగురు బాలల్లో ముగ్గురు ఆచూకీ లభించిందని.. మిగిలిన ఇద్దరు బాలల ఆచూకీ కనుక్కునేందుకు పోలీసుల సహాయం తీసుకుంటున్నామని మంత్రికి అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 08:13 PM