ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: నాపై కడియం కుట్రలు

ABN, Publish Date - Jun 21 , 2025 | 03:31 AM

మంత్రిగా ఉన్న తనపై కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి లేనిపోనివి చెప్పి, తనను బద్నాం చేస్తున్నారని తెలిపారు.

  • నా ముందు కూర్చునేందుకు శ్రీహరికి నామోషీగా ఉంది

  • సీఎం రేవంత్‌కి, పొంగులేటికి లేనిపోనివి చెబుతున్నారు

  • నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం

  • మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ

వరంగల్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రిగా ఉన్న తనపై కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి లేనిపోనివి చెప్పి, తనను బద్నాం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ తనను కలిసిన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. మంత్రిగా ఉన్న తన ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా భావిస్తున్నారని, అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో నడిపించినట్లుగా కాంగ్రె్‌సలో నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆయనకు అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అదృష్టం కలిసి రావటంతో మంత్రిని అయ్యానని అయ్యారు.

కడియం కుమార్తె కావ్యకు అదృష్టం కలిసి వచ్చి వరంగల్‌ ఎంపీగా ఎన్నికయ్యారని, తన కుమార్తెకు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదని తెలిపారు. ‘‘కడియం కుమార్తెను ఎంపీ పదవి నుంచి తీసేయ్యాలని నేను అంటున్నానా?’’ అని సురేఖ ప్రశ్నించారు. కాగా, గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ఆంధ్రకు నిధులు ఇచ్చి, తెలంగాణపై వివక్ష చూపటం తగదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. పుష్కరాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకరావాలని కోరారు.

Updated Date - Jun 21 , 2025 | 03:31 AM