ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి..

ABN, Publish Date - Jul 25 , 2025 | 12:17 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో గురువారం స్థానిక పీహెచ్‌సీని ఆక స్మికంగా తనిఖీ చేశారు.

నెన్నెల పీహెచ్‌సీలో అటెండెన్స్‌ రిజిష్టరు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

-జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌

నెన్నెల, జులై 24 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో గురువారం స్థానిక పీహెచ్‌సీని ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక ఏఎన్‌ఎం, మరో ఇద్దరు నాన్‌క్లినికల్‌ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా వారు సమ యపాలన ఎందుకు పాటిండం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌ సెలవులో ఉంటే ఆయుష్‌ వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలు వైద్య సేవ లు కొనసాగించాలని సూచించారు. నైడ్‌ డ్యూటీ చేసే వారి వివరాలు నో టీసుబోర్డుపై రాయాలన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిం చా లన్నారు. పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో క్లోరినేషన్‌, పారి శుధ్య పనులు చేయించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఇంటింటికి తిరిగి రోగుల వివరాలు సేకరించాలన్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్నం దున నెలలు నిండిన గర్భవతులను ముందుగానే ఆసుపత్రులకు తరలిం చాలన్నారు. ఆయన వెంట మాస్‌మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, వెంకటసాయి ఉన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:17 AM