ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- సహకార సంఘాల బలోపేతానికి చర్యలు

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:41 PM

వ్యవసాయ సంఘాలు బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కొన్ని చట్టాలను తీసుకు వస్తుందని నాబార్డు డీడీఎం వీరభద్రుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార ప్రాథమిక సంఘం కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు.

మాట్లాడుతున్న నాబార్డు డీడీఎం వీరభద్రుడు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సంఘాలు బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కొన్ని చట్టాలను తీసుకు వస్తుందని నాబార్డు డీడీఎం వీరభద్రుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార ప్రాథమిక సంఘం కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలను మరింత బలం చేకూర్చే వవిధంగా ఎఫ్‌సీవోలాగా రూపాంతరం చేయడానికి మార్పులు తీసుకు వచ్చిందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎఫ్‌సీవోలుగా మార్చబడినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంకు 2025వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ కో ఆపరేటీవ ఇయర్‌గా ప్రకటించిందన్నారు. రైతులు దళారీ వ్యవస్థను దూరం చేయడం, పంట ఆర్థిక సహాయాన్ని డీసీసీబీ బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రైతులకు అందించడం, సహకార సంఘాల సహకారంతో ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభించి మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీవో బిక్కునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, వైస్‌ చైర్మన్‌ ప్రహ్లాద్‌, డీసీసీబీ మేనేజర్‌ అనీల్‌కుమార్‌, సీఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:41 PM