ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ABN, Publish Date - May 15 , 2025 | 11:10 PM

వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

దోమలపెంటలో నూతన మోటారు పంపులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

దోమలపెంట, మే 15 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. గురువారం దోమల పెంటలో 40హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మోటారు పంపులను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత కాలం గా దోమలపెంట, ఈగల పెంట గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను అధిగమించేం దుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నూతనంగా ప్రారంభించిన రెండు మోటారు పంపులతో తాగునీటి సమస్యకు కొంత వరకు ఉపశమనం కలుగుతుందన్నారు. మరో రెండు నెలలో మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేసి ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తా మని ఆయన పేర్కొన్నారు. అనంతరం దోమల పెంలో మార్కండేయ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్ర మంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సుధాకర్‌ సింగ్‌, డీఈ హేమలత, అమ్రాబాద్‌ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు డాక్టర్‌ అనురాధ, స్థానిక నాయకు లు కిషన్‌, చత్రునాయక్‌, మోయిజొద్దీన్‌, గురు వయ్య, హరినారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:10 PM