kumaram bheem asifabad- గిరిజనుల అభివృద్ధికి చర్యలు
ABN, Publish Date - Jun 19 , 2025 | 10:38 PM
ప్రధానమంత్రి జన్‌మన్, ధర్తీ అబ జన జాతీయ గ్రామీణ ఉత్కర్ట్ అభియాన్ (జుగా) పథకాల ద్వారా పీవీటీసీలు గిరిజనులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభారి గణేశ్ నాగరాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్‌మన్, ధర్తీ అబ జన జాతీయ గ్రామీణ ఉత్కర్ట్ అభియాన్ (జుగా) పథకాల ద్వారా పీవీటీసీలు గిరిజనులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభారి గణేశ్ నాగరాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పీవీటీజీలు, ఇతర గిరిజన సామాజిక వర్గాల గ్రామాలలో గృహాలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, మత్స్య సంపద యోజన, పశు సంపద, గ్రామాల్లో సెట్ టవర్ల ఏర్పాటు అంశాలపై సంబందిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పీవీఈజీలు, గిరిజనుల అబివృద్ధికి చేపట్టిన ప్రధాన మంత్రి జన్‌మన్, జుగా పథకం ద్వారా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ నెల 30 తేదీ వరకు జిల్లాలో 102 గిరిజన గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఆధార్, ఆయూష్మాన్‌భారత్, అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, డీపీవో భిక్షపతి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి సురేష్, జిల్లా మత్స్య శాఖాధికారి సాంబశివరావు, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ప్రతినిధి గణేశ్ నాగరాజన్ అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్ అభియాన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో గిరిజనులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అన్ని విదాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్ అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గిరిజనులకు అందుతున్నాయనా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 102 గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కోసం ఈ పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, క్రీడల అధికారి మీనారెడ్డి, ఎస్‌సీఆర్పీ రవీందర్, అనంత్, కార్యదర్శి మధుకర్, కిష్టయ్య, సుశీల, మల్లికార్జున్ ఉన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 10:38 PM