ఐక్యతకు నిదర్శనం మే డే...
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:26 PM
కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వా రి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మే డే కార్మికుల ఐక్యత, పోరాటా లకు నిదర్శనంగా నిలుస్తుంది.
-నేడు 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
-వేడుకలకు కార్మికులు సన్నద్ధం
మంచిర్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వా రి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మే డే కార్మికుల ఐక్యత, పోరాటా లకు నిదర్శనంగా నిలుస్తుంది. మే డేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు....
19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పని చేసేందుకు అసం ఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడి దా రులు శ్రామికులతో బానిసల్లాగా పని చేయించి అధికా లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయించేవారు. పని స్థలా ల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొం దరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పో యేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా, శ్రమదోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మే డే. కా ర్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ఎనిమిది గంటల పని దినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం.
హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం....
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంత మంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయం లో మేమూ మనుషులమే...మా శక్తికి కూడా పరిమితు లుంటాయి....ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పో రాడి చివరకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గం టలు విశ్రాంతి, ఎనిమిది గంటలు రిక్రియేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్నారు. చికాగో పోరాటం కంటే ముందే భారత దేశంలో కలక త్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రె ౖల్వే స్టేషన్‌లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రై ల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు. అయితే ఆ పోరాటం విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారక పో వడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920 లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుం చే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1923 లో మొదటిసారిగా భారత దేశంలో మే డేను పాటిం చారు. అప్పటి నుంచి ప్రతి యేడు కార్మికులు ఐక్యంగా మే డేను పాటిస్తున్నారు. 1985 తర్వాత చోటు చేసు కున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరి ణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాలు కార్మిక చ ట్టాల అమలుకు నోచుకోవడం లేదు. మార్కెట్‌లో శక్తు లు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉందో అక్కడే కంపెనీలు పెట్టేవారు. అమెరికాలో ఉన్న కంపెనీలు అ క్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టి... కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ కార్మికులతో 10 నుంచి 12 గంటల వకు పని చేయించే వారు. ఇప్పటికీ దేశంలో అక్కడక్కడ ఈ శ్రమ దోపిడీ కళ్లకు గట్టినట్లు కనిపిస్తుంటుంది. వివిధ రంగాల్లో వి ద్యావంతులైన యువత నేడు అధిక శ్రమదోపిడీకి గు రవుతూనే ఉన్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ సర్వసాఽధారణం. కార్మిక చట్టాలను పారిశ్రామిక రంగం లో అమలు కోసం పోరాటం అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలక వర్గాలు బహుళజాతి కం పెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అ సంఘటిత రంగంలో అయితే ఇది మరింతగా విస్తరిం చింది. ప్రభుత్వాలు కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగాల పే రుతో ప్రవేశపెట్టిన ఔట్ సోర్సింగ్ విధానంలోనూ కా ర్మిక చట్టాల నియమాలు అమలు కావడం లేదు. పైగా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గి స్తూ కాంట్రాక్టీరణ చేపడుతున్నారు. ప్రైవేటీకరణ పెరిగి న కొద్దీ సర్వీసు భద్రత తగ్గుముఖం పడుతోంది. ఫలి తంగా శ్రమదోపిడీ పెరుగుతోంది. ప్రపంచీకరణ వల్ల వందల సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాం డ్లు కూడా నేడు అమలుకు నోచుకోవడం లేదు. ప్ర పంచ వ్యాప్తంగా 1886లో ఆరంభమైన ఈ ఉద్యమం నే డు 139 ఏళ్ల పండుగ జరుపుకోబోతోంది.
మే డే ఏర్పాట్లలో కార్మికులు...
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపు కునేందుకు సంఘటిత, అసంఘటిత కార్మికులు సన్న ద్ధం అవుతున్నారు. వివిధ రంగాలకు చెందిన కార్మికు లతో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జ రుగుతున్నాయి. సింగరేణి గనులు, మున్సిపల్ కాం ట్రాక్ట్ కార్మిక సంఘం, హమలి సంఘం, ఇఫ్టూ, ఐఎన్‌టీయూసీ, కూరగాయల కార్మిక సంఘం, సీపీఐ, ఆధ్వ ర్యంలో ఆయా సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొననున్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:27 PM