Tirumalanatha Swamy Temple: తిరుమలనాథస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:58 AM
పెద్దకాపర్తిలోని భూసమేత శ్రీ తిరుమలనాథస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు (దేవాదాయశాఖ), ఆర్కిటెక్చర్ గోవిందహరి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు గోవిందహరి, ఎమ్మెల్యే వీరేశ
చిట్యాలరూరల్, జూన 30 (ఆంధ్రజ్యోతి): పెద్దకాపర్తిలోని భూసమేత శ్రీ తిరుమలనాథస్వామి ఆలయ (Tirumalanatha Swamy Temple) అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు (దేవాదాయశాఖ), ఆర్కిటెక్చర్ గోవిందహరి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. మండలంలోని పెద్దకాపర్తి శివారులో గుట్టపై గల తిరుమలనాథస్వామి ఆలయాన్ని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సోమవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకోగా పురోహితులు వేదాశీర్వచనాలు అందజేశారు.
ఆలయాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పచ్చదనం ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధికి కావాల్సిన అనుమతులు, ఆలయం వద్ద చేపట్టే నిర్మాణాలకు అవసరమయ్యే ఖర్చు అంచనా గురించి ఇరువురు చర్చించారు. పూర్తిస్థాయిలో అన్ని నిర్మాణాలకు అవసరమయ్యే అంచనాలను త్వరలో రూపొందించనున్నట్లు సలహాదారు ఎమ్మెల్యేకు తెలిపారు. నిర్మాణాలకు ఇతర అవసరాలకు సంబంధించిన అంచనాలను వివరాలను తనకు అందజేయాలని కార్యనిర్వాహణాధికారి నాగిరెడ్డికి సూచించారు. ఆలయ అభ్యున్నతికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 08:42 AM