CPI Maoist Bandh: 10న దేశవ్యాప్త బంద్‌కు నక్సల్స్ పిలుపు
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:45 AM
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సహా 27 మంది మృతికి నిరసనగా జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు సీపీఐ(మావోయిస్టు) పిలుపునిచ్చింది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని కూడా కోరారు.
హైదరాబాద్/ఏటూరునాగారం/చర్ల/అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన ఎనౌకౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా.. 27 మంది నక్సల్స్ మృతికి నిరసనగా ఈనెల 10న దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ(మావోయిస్టు) పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మీడియాకు శనివారం ఓ సుదీర్ఘ లేఖ విడుదలైంది. ‘‘మే 21 భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు. ఈ నెల 10న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాం. 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా నంబాల సహా.. 27 మంది అమరుల స్మారక సభలు ఏర్పాటు చేయాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Updated Date - Jun 01 , 2025 | 04:45 AM