Manda Krishna Madiga: గతంలో ఉన్నత వర్గాలకే పద్మ అవార్డులు
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:50 AM
గత ప్రభుత్వంలో కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులు ఉన్నత వర్గాలకే వచ్చేవని, ప్రధాని మోదీ వచ్చాకే ఈ పదేళ్లలో ఎందరో పేదలకు ఆయా రంగాల్లో వారి కృషికి గుర్తింపుగా పద్మ అవార్డులు వస్తున్నాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
మోదీ వచ్చాకే సామాన్యులకు వస్తున్నాయి: మంద కృష్ణ
హైదరాబాద్, బర్కత్‌పుర, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులు ఉన్నత వర్గాలకే వచ్చేవని, ప్రధాని మోదీ వచ్చాకే ఈ పదేళ్లలో ఎందరో పేదలకు ఆయా రంగాల్లో వారి కృషికి గుర్తింపుగా పద్మ అవార్డులు వస్తున్నాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోంకు హాజరై వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యులు, పేదవారిపై ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తనలాంటి సామాన్యులకు పద్మశ్రీ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. వర్గీకరణ ఎంత అవసరమో తెలియజేసేందుకు హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు మోదీ వచ్చి తమ సమస్యను ప్రత్యక్షంగా చూశారన్నారు.
వర్గీకరణపై సుప్రీం తీర్పు వచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 7న నిర్వహించే ‘లక్ష డప్పులు వేల గొంతుల’ కార్యక్రమానికి తెలంగాణ ఎరుకల ఆదివాసీ సంఘం ఆదివారం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. వర్గీకరణకు హామీఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు స్పందించడంలేదన్నారు. కాంగ్రె్‌సలో మాలల పలుకుబడి అధికంగా ఉందన్నారు.
Updated Date - Jan 27 , 2025 | 05:50 AM