ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాను దినచర్యగా పాటించాలి

ABN, Publish Date - May 27 , 2025 | 11:18 PM

మన జీవి తంలో యోగాను దినచర్యగా పాటించాలని, యోగా సాధనతో మనతో పాటు, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో మ నం సఫలీకృతమవులమవుతామని జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్‌ అన్నారు.

యోగా ప్రాముఖ్యతను ఏఎన్‌ఎం, ఆశాలకు వివరిస్తున్న జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్‌

- జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్‌

- అంతర్జాతీయ యోగా దినోత్సవంపై వైద్య సిబ్బందికి అవగాహన

నారాయణపేట టౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): మన జీవి తంలో యోగాను దినచర్యగా పాటించాలని, యోగా సాధనతో మనతో పాటు, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో మ నం సఫలీకృతమవులమవుతామని జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు, యూపీహెచ్‌ సిబ్బందికి మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రపంచ వ్యా ప్తంగా 198 దేశాల్లో వచ్చేనెల జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నా రన్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ఒత్తిడిలను అధిగమించడంతో పాటు, బీపీ, షుగర్‌, మానసిక వ్యాధులను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, సంఘ సేవకులు, ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, యోగాను మన నిత్య జీవి తంలో ఒక నిత్యావసరంగా అన్వయించుకోవా లని పిలుపునిచ్చారు. ప్రతీరోజు ఉదయం 7 గంటలకు గవర్నమెంటు జనరల్‌ హాస్పిటల్‌లో యోగా క్లాసులు నిర్వహిస్తామని, అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. యూపీహెచ్‌ వైద్యాధికారి డాక్టర్‌ నరసింహరా వు, డీపీవో భిక్షపతి, యోగా ఇన్‌స్పెక్టర్‌ నరసిం హులు, పతంజలి యోగా సమితి అధ్యక్షుడు సురేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:18 PM