ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:24 PM
క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజల మన్ననలు పొందే లా బాధ్యతతో విధులు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హోంగార్డు అధికారులకు సూచించారు.
ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజల మన్ననలు పొందే లా బాధ్యతతో విధులు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హోంగార్డు అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ నుంచి రొటేషన్ వారిగా జోగుళాంబ గద్వాల జిల్లాకు వచ్చిన 53 మంది హోంగార్డు అధికారులతో ఎస్పీ సోమవా రం గ్రీవెన్స్ హాల్‌లో మాట్లాడారు. జిల్లాలో విధు లు నిర్వహించేందుకు రొటేషన్ పద్ధతిలో మహబూబ్‌నగర్ నుంచి గద్వాలకు వచ్చిన హోంగా ర్డు అధికారుల సంక్షేమంపై ఇక్కడి పోలీస్ అధి కారులు ప్రత్యేక శ్రద్ధ పెడతారన్నారు. విధులప రంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారు ల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించడం జ రుగుతుందన్నారు. అలాగేసిబ్బంది క్రమశిక్షణతో మెలుగుతూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు రోజువారి విధులపట్ల అప్రమత్తంగా ఉం డాల ని, అఽధికారుల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని, కేటాయించిన ఎం.టి.సెక్షన్, జనరల్ డ్యూ టీ, బ్లూకోల్డ్స్, ట్రాఫిక్, తప్పాల్ విభాగాల లో విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. తా ము పనిచేసే విభాగంలో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొంది పోలీస్ శాఖకు మరింత మం చిపేరు తేవాలన్నారు. సమావేశంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, ఆర్‌ఐ వెంకటేశ్, ఆర్ ఎస్‌ఐ విజయభాస్కర్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన హోంగార్డు అధికారులు ఉన్నారు.
Updated Date - Apr 21 , 2025 | 11:24 PM