ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.300 కూలీ పడేలా పనిచేయాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:42 PM

ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 కూలీ పడే విధంగా పనిచేయాలని, ఆ విధంగా పని కల్పించాలని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

- నసనూర్‌, పచ్చర్ల గ్రామాల్లో పర్యటించిన అదనపు కలెక్టర్‌ నర్పింగరావు

రాజోలి, మే 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 కూలీ పడే విధంగా పనిచేయాలని, ఆ విధంగా పని కల్పించాలని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. మంగళవారం మండలంలోని పలుగ్రామాల్లో ఆయన పర్యటించారు. పర్యటన లో భాగంగా మండలంలోని సననూర్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకంపై గ్రామస్థులతో ఆ యన చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలుఉపాధి పనులను ఆయన దృ ష్టికి తెచ్చారు. అనంతరం ఉపాధి హామీ పనుల్లో పెద్దధన్వాడలో పొలం బాటల పనిని ఆయ న పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కూలీకి రూ.300 కూలీ పడేలా పని చేయాలని, కూలీల కు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు సూచించారు. అనం తరం మండలంలోని పచ్చర్లలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ఉన్న సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. తుమ్మిళ్లకు సంచు ల కొరతఉందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పచ్చర్లలో నిర్వహించిన స్నేహ మీటింగ్‌, ఉపాధి హామీ పథకం కింద నాలుగు పశువుల పాకలు, ఎరువు గుంత పనులను ఆ యన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజామొయినుద్దిన్‌, ఏపీవో ప్రసాద్‌, ఏపీఎం మార్తెమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వసంత, రాఘవేంద్ర, టీఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:42 PM