భారత్‌పై అమెరికా పెత్తనం ఏమిటి ?
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:34 PM
అగ్రరాజ్యం అమెరికా మన దేశంపై పెత్తనం చెలాయించడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
గద్వాల టౌన్/ గద్వాల క్రైం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : అగ్రరాజ్యం అమెరికా మన దేశంపై పెత్తనం చెలాయించడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై జిల్లా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నాలుగవ ఆర్థికశక్తిగా ఎదిగామని గొప్పలు చెబుతున్న కేంద్ర పాలకులు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అంతరాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గద్వాల జిల్లాలో సాగుతున్న ఆధిపత్య రాజకీయాలను ప్రజలకు వివరించి, ప్రత్యామ్మాయ నాయకత్వం కోసం సిద్ధమయ్యేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర కార్యదర్శి హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన జాన్‌వెస్లీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని అంబ్కేర్, జ్యోతిబా పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సమావేశానికి ముందు పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్‌నాయక్, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు జి.రాజు, రేపల్లే దేవదాస్, పరంజ్యోతి, వీవీ నరసింహ, మద్దిలేటి, ఉప్పేరు నరసింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, నాయకులు ఈదన్న, రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 11:34 PM