ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:28 PM

తమపై ఎంతో నమ్మకంతో టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీలుగా బాధ్యతలు అప్పగించారని, ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌ముదిరాజ్‌, ఏపీ మిథ్‌న్‌రెడ్డి అన్నారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సత్కరిస్తున్న ముడా చైర్మన్‌

- టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌ముదిరాజ్‌, మిథున్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : తమపై ఎంతో నమ్మకంతో టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీలుగా బాధ్యతలు అప్పగించారని, ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌ముదిరాజ్‌, ఏపీ మిథ్‌న్‌రెడ్డి అన్నారు. తమకు బాధ్యతు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుఽధవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన వారిని పార్టీ శ్రేణులు సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమన్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బీసీలపై కాంగ్రెస్‌కు మాత్రమే ప్రేమ ఉందని, బీసీలను పట్టించుకునే ఏకైక నాయకుడు రాహుల్‌గాంధీనేనని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ద్వందనీతి ప్రదర్శిస్తుందని విమర్శించారు. వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇది వరకే అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని, కేంద్రం జాప్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో తానూ ఉన్నానని, పార్టీ తనకు డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పీసీసీ పదవికి రాజీనామా చేస్తానని సంజీవ్‌ముదిరాజ్‌ స్పష్ఠం చేశారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, నాయకులు సీజె బెనహర్‌, సాయిబాబ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:28 PM