పాడి పరిశ్రమను బలోపేతం చేస్తాం
ABN, Publish Date - Apr 23 , 2025 | 11:30 PM
నష్టాల్లో ఉన్న విజయ డెయిరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి అండగా నిలిచిందని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహ కార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్త అమిత్‌రెడ్డి అన్నారు.
- తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్త అమిత్‌రెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : నష్టాల్లో ఉన్న విజయ డెయిరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి అండగా నిలిచిందని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహ కార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్త అమిత్‌రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులను పెంచి సంస్థ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చా రు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో బుధవారం డిప్యూటీ డైరెక్టర్ ధన్‌రాజ్ అధ్యక్షతన నిర్వహించిన పాడి రైతుల సమావేశానికి వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్.రెడ్డితో కలిసి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాల సేకరణ ప్రతీరోజు 4.20 లక్షల లీటర్లు జరుగుతుండ గా.. అందులో నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల నుంచి 60శాతం పాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతీరోజు విజయ పాలు 2.20 లక్షల లీటర్ల అమ్మ కాలు జరుగుతున్నాయని, మరో 2లక్షల లీటర్లు మిగులుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అంగన్‌వా డీ కేంద్రాలకు, అన్ని గురుకులాలకు పాలను విక్రయిస్తుండగా మరో లక్ష లీటర్లు మిగులుతున్నా యని, వీటితో పాల ఉత్పత్తులను చేస్తున్నట్లు తెలి పారు. విజయ డెయిరీ బ్రాండ్‌కు ఓనర్లు ప్రజలే నని అమిత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద కోట్లు మం జూరు చేయడంతో పెండింగ్ బిల్లులను చెల్లించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కేవీఎన్.రెడ్డి మాట్లాడుతూ ఆవుపాల ధర తగ్గడం కొంత భారమైనప్పటికీ పాడి రైతుల ప్రయోజనానికి ప్రభు త్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభు త్వ తప్పిదాల వల్లే సంస్థ నష్టాల్లోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మధుసూదన్‌రావు, ఎస్ ఈ దేవేందర్‌రావు, కల్వకుర్తి పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ యాకన్న, పాడి రైతులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌నాయక్, పలువురు బీఎంసీ, ఎంసీసీ అధ్యక్షుడు, నాయకు లు, రైతులు తదితరులు ఉన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 11:30 PM