బాధితులకు అండగా ఉంటాం
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:31 PM
హైకోర్టు ఆదేశాల మేరకు మం డలంలోని సిరసనగండ్ల పంచాయతీలోని అయోధ్యనగర్‌లో నిరుపేదల కు చెందిన 33 మంది ఇళ్లను అధికారులు నేల మట్టం చేయడంతో రో డ్డుపాలు అయిన బాధితులకు సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి పా దాల సాక్షిగా అండగా ఉంటామని అచ్చంపేట, కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యేలు గువ్వల బాలరాజు, గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు.
- మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, జైపాల్‌యాదవ్
చారకొండ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు మం డలంలోని సిరసనగండ్ల పంచాయతీలోని అయోధ్యనగర్‌లో నిరుపేదల కు చెందిన 33 మంది ఇళ్లను అధికారులు నేల మట్టం చేయడంతో రో డ్డుపాలు అయిన బాధితులకు సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి పా దాల సాక్షిగా అండగా ఉంటామని అచ్చంపేట, కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యేలు గువ్వల బాలరాజు, గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం అయోధ్యనగర్ (గుట్ట)లో నేలమట్టమైన ఇళ్లను వారు పరిశీలించి బాధి తులను పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు వారి ముందు త మ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేంవంత్‌రెడ్డికి జన్మనిచ్చిన గడ్డ ఆపదలో ఉంటే కనీసం పరామర్శించి, ఓదార్చక పోవడం బాధాకరమని అన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే పునరావాసం కల్పించి ఆదుకోవాలని అన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు సిరసనగండ్ల మాజీ సర్పంచులు యా తం శ్రీనివాసులు, యాతం శారద తన సొంత పొలంలో ఇళ్ల స్థలాలు కే టాయించి మరో ఆయోధ్యనగర్‌గా ఏర్పాటు చేసుకొంటామని ముందుకు రావడంతో వారు అభినందించారు. బాధితుల ఇంటి నిర్మాణాలకు రూ. రెండు లక్షలు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా బాధితులకు నిత్యవస సరకులకు రూ. 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మునిసిపల్ మాజీ చైర్మన్ యడ్మ సత్యం, మన తెలంగాణ బీసీ మహా సభ వ్యవస్థాపకుడు కొమ్ము శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎదిరే రవిందర్, మాజీ జడ్పీటీసీలు పగడాల రవికుమార్, రాంబాబు,మాజీ ఎంపీటీసీ ల క్ష్మణ్‌నాయక్, నాయకులు సలీం, రామ కృష్ణ, రమేష్, కమలాకర్, శ్రీశైలం, మోహన్‌రెడ్డి, కేశమోని మధు, చండీ శ్వర్‌గౌడ్, మహేష్‌గౌడ్, కొండల్, రాంలాల్, సరిరాం నాయక్‌పాల్గొన్నారు.
ఆలయ చైర్మన్, అర్చకుల దిష్టి బొమ్మల దహనం
తమ ఇళ్లు కూల్చివేతకు కారణమైన సిరసనగండ్ల సీతారామచంద్రస్వా మి ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మతో పాటు ఆలయ అర్చకులు ఢేరం మురళీదర్ శర్మ, ఢేరం లక్ష్మణశర్మ, మేనేజర్ నిరంజన్ దిష్టి బొమ్మలను బాధితులు చెప్పుల దండలు వేసి అయోధ్యనగర్ (గుట్ట) ప్రధాన రహదారిపై దహనం చేశారు. నిరసన వ్యక్తం చేశారు.
Updated Date - Jun 20 , 2025 | 11:31 PM