ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:16 PM
జిల్లాలో మ హిళలు తయారు చేసే ఉత్పత్తు లకు మార్కెటింగ్ కల్పిస్తామని ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రత్యేక అధికారి సౌజన్య తెలిపా రు.
నారాయణపేట టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మ హిళలు తయారు చేసే ఉత్పత్తు లకు మార్కెటింగ్ కల్పిస్తామని ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రత్యేక అధికారి సౌజన్య తెలిపా రు. గురువారం నారాయణపేట లోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశానికి ఆమె తన బృందంతో కలిసి హాజరయ్యారు. వెదురు ఉత్పత్తులు, బంకమట్టితో ఆభరణాలు, స్వీట్స్, కాటన్‌చీరలు, చట్నిలు, నూనెలు, పల్లి, నువ్వు లు, కొబ్బెర, సబ్బులు, అగర్ బత్తీలు, కలంకారి వస్ర్తాలు, తాటి ఆకులు, బ్యాగ్స్, కారంపోడి, ఇతర ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం హైదరాబాద్ నగరంలో మార్కెటింగ్ కల్పిస్తామని భరోసా కల్పించారు.
Updated Date - Jul 10 , 2025 | 11:16 PM