గన్నీ బ్యాగులు అందించి, లారీలను పంపిస్తాం
ABN, Publish Date - May 17 , 2025 | 11:07 PM
రైతులు పండించిన ధా న్యాన్ని రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రతీ సెంటర్‌కు గన్నీ బ్యాగులు, లారీ లను రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూస్తానని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు.
- అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్
మాగనూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ధా న్యాన్ని రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రతీ సెంటర్‌కు గన్నీ బ్యాగులు, లారీ లను రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూస్తానని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఆ యన మండలంలోని నేరడగమ్ము గ్రామంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలిం చి, రైతులతో మాట్లాడారు. గన్నీ బ్యాగుల గురించి, లారీల గురించి విండో కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు సరైన సమాధానం చెప్పకుండా ఇప్పుడు పంపిస్తాం, రేపు పంపిస్తా మని చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అ లాగే మిల్లులకు ట్రాక్టర్లలో ధాన్యం తరలించా మని, ట్రాక్టర్ల కిరాయి డబ్బులు ఇవ్వాలని రైతు లు కోరగా ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎంపీడీవో రహమతుద్దీన్, ఎంపీవో విజయలక్ష్మి, మండల ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.
Updated Date - May 17 , 2025 | 11:07 PM