ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గద్వాల కోటపై బీసీ జెండా ఎగరేస్తాం

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:27 PM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కోటపై బీసీ జెం డా ఎగురవేస్తామని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రాచాల యుగంధర్‌గౌడు అ న్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర జేఏసీ చైర్మన్‌

- బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ యుగంధర్‌గౌడు

ఎర్రవల్లి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కోటపై బీసీ జెం డా ఎగురవేస్తామని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రాచాల యుగంధర్‌గౌడు అ న్నారు. ఆదివారం ఎర్రవల్లి మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ గద్వాల జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గద్వాల కేంద్రంలో కొందరు అగ్రవర్ణ నాయకులు చేసిన రాజకీయ కుట్రలకు బీసీ అభ్యర్థి బలై ఓటమి చెందారని గుర్తు చేశారు. పార్టీలు వేరైనా ఉన్నత వర్గా ల వారు ఏవిధంగా ఏకమౌతారో, బీసీలు కూడా ఏకమై మన ఐక్యతను చాటాల్సిన స మయం ఆసన్నమైందని తెలిపారు. నడిగడ్డ లో ఇంతవరకు రాజకీయ పదవులు అనుభవించిన కొందరు పైకి శత్రువులుగా నటించి లోలోన ఒక్కటై బీసీల ను బలి పశువులు చే స్తున్న విషయం అంద రికి అర్థమైందని గు ర్తు చేశారు. వచ్చే స్థా నిక సంస్థల ఎన్నికల ను కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కేటాయించిన తరువాతనే నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చే శారు. బీసీ రిజర్వేషన్‌ల అంశం పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోయినా పార్టీ తరపున బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయిస్తామని రేవంత్‌రెడ్డి సర్కార్‌ అనటం భా వ్యం కాదని అన్నారు. కేవలం కాంగ్రెస్‌ పా ర్టీ ఆ విధంగా కేటాయిస్తే మిగిలిన పార్టీలు కేటాయించక పోతే బీసీలకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. బీ సీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శా తం రిజర్వేషన్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌ తే వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చే శారు. బీసీ పొలిటికల్‌ జేఏసీ జిల్లా అధ్యక్షు డు నరసింహ యాదవ్‌, నాయకులు నాగరాజు, ఈదన్న నాయుడు, ఎల్లగౌడు, పాం డురంగ యాదవ్‌, వివిగౌడు, గూడుషా, శి వ, అంజన్న, జితేందర్‌, ధర్మేంధ్ర, నర్సింహ, రమేష్‌, రాజుతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీసీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:27 PM