పేద రైతులకు న్యాయం చేస్తాం
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:28 PM
ధరణిలో లక్షల ఎకరాల పేదల భూమిని గత పాల కులు కొల్లగొట్టారని వాటిని భూభారతి చట్టం ద్వారా రాబట్టి.. పేద రైతులకు న్యాయం చే స్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ధరణిలో కొల్లగొట్టిన లక్షల ఎకరాల భూములను రాబడతాం..
- కోర్టులో లేని అన్ని భూవివాదాల పరిష్కారానికి చర్యలు
- రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- నారాయణపేట జిల్లా ఖాజీపూర్‌లో భూభారతి సదస్సు
మద్దూర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ధరణిలో లక్షల ఎకరాల పేదల భూమిని గత పాల కులు కొల్లగొట్టారని వాటిని భూభారతి చట్టం ద్వారా రాబట్టి.. పేద రైతులకు న్యాయం చే స్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభు త్వం అమలు పర్చబోయే భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఖాజీపూర్‌లో గురువా రం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు మం త్రి హాజరై మాట్లాడారు. వచ్చే నెలలో అన్ని మండలాల్లో కలెక్టర్‌తో చట్టంపై రైతులకు అవగాహన సమావే శాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. పలు రాష్ర్టాల చట్టాల ను పరిశీలించి 14 నెలల పా టు మేధావులు చర్చించి, శ్రమిం చి ఎలాంటి లోపంలేని విధంగా ఈ చట్టం రూపకల్పన చేయనున్న ట్లు చెప్పారు.
కొత్త చట్టం అమలైతే కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తోందని ప్రతిపక్ష నాయకులు అబ ద్దపు ప్రచారాలు చేయడం జరుగుతోందన్నా రు. హక్కులు కల్గిన రైతులకు భూమిని సంక్రమింప చేయడమే ప్రభు త్వ విధానమన్నారు. రికా ర్డుల్లో చిన్న తప్పు ఉన్నా స్వంత భూమిని అమ్ముకోలేని పరిస్థితి ఉండేదనాన్నారు. వీటిని సరి చేసేందుకు జిల్లా కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగినా ఫలితం దక్కని ధరణీ వల్ల ఉండేదన్నారు. వాటిలో ఉన్న చిక్కులు పేద రైతుల కష్టాలకు కారణంగా ఉండేదన్నారు. ధరణీ వల్ల రైతులు పడుతున్న కష్టాలు చూసిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే దానిని పాతాళగంగలో విసురుతామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకే రైతుల కష్టాలను దూరం చేసేందకు భూభారతి చట్టం తీసుకువచ్చారన్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరిచి రైతులకు తమ భూములపై భరోసా కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టి తీసుకొచ్చారు. వారి దరఖాస్తులను స్వయంగా మంత్రే తీసుకున్నారు. న్యాయమైన అన్ని భూ సమస్యలు పరిష్కార మార్గం లభిస్తోందని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు రెవెన్యూ కల్టెకర్ బెన్‌షాలం చట్టం గురించి వివరించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఇతర శాసనసభ్యులకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. మక్తల్, నారాయణపేట, పరిగి ఎమ్మెల్యేలు శ్రీహరి, పర్ణికారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, కాడా అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్డీవో రాంచందర్, తహసీల్దార్ మహేష్‌గౌడ్ , ఎంపీడీవో నర్సింహారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, జడ్నీటీసీ మాజీ సభ్యుడు రఘపతిరెడ్డి, మండల నాయకులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూభారతితో రైతులకు మేలు..
ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చట్టం రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. ఽ ఆధార్ కార్డుల మాదిరిగానే భూమికి సంబంధించిన అన్ని వివరాలతో భూధార్ కార్డుల జారీని ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతోంది.
- రాంమోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
కొత్త చట్టం ఓ ఆయుఽధం లాంటిది
భూసమస్యల పరిష్కారానికి ఈ చట్టం రైతులకు ఓ ఆయుధంగా మారుతుంది. ఎలాంటి సమస్యనైనా స్థానికంగానే పరిష్కరించే అవకాశం కొత్త చట్టం కల్పింస్తోంది. ప్రచారం సందర్భంగా తాను ఎక్కువ శాతం భూసమస్యలే తమ దృష్టికి వచ్చాయి. వాటినన్నిటికీ పరిష్కారమార్గం లభించే అవకాశం ఏర్పడింది.
- పర్ణికారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే
ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకోబోయే నిర్ణయాలన్నీ ఆ మేరకే ఉంటాయి. కొత్త చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తోంది. స్థానికంగానే రైతుల భూ కష్టాలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
- సీతా దయాకర్‌రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్,
వందేళ్లయినా రైతుల హక్కులకు భంగం కల్గదు..
ప్రభుత్వం అమలు చేయబోయే నూతన భూ చట్టంతో వందేళ్లయినా రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటోంది. పక్కాగా వివరాల నమోదు, భూహక్కులను కల్గిస్తోంది.
- తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి
Updated Date - Apr 17 , 2025 | 11:28 PM