టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:59 PM
టీడీపీకి పూర్వ వైభవం తీసు కొస్తామని, అందుకు త్వరలో గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు.
- త్వరలో గ్రామ, మండల కమిటీలు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు
మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : టీడీపీకి పూర్వ వైభవం తీసు కొస్తామని, అందుకు త్వరలో గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు సభ్యు త్వ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం సాయన్నగౌడ్ స్వగృహంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో 2024-26నకు సంబంధించి 1,78,000 మందిని సభ్యత్వం చేయడం జరిగిందన్నా రు. 19 నియోజకర్గాలు, 17 పార్లమెంట్లలో 578 అడ్‌హక్ కమిటీ సభ్యులు, 17 మంది పార్లమెంటు కన్వీనర్ల కృషి వల్ల సభ్యత్వం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీరాములు, బుచ్చన్న, వెంకటన్న టీడీపీలో చేరినట్లు తెలిపారు. 17 పార్లమెంటు, 119ని యోజకవర్గాల్లో త్వరలో గ్రామ, మండల, పా ర్లమెంట్ కమిటీలు మే 15 వరకు పూర్తి చే యాలని తెలిపారు. నియోజకవర్గ నాయకులు కాశీం, సాయన్నగౌడ్, రాములుయాదవ్, శ్రీనివాసులు, మురళి, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, సురేందర్‌గౌడ్, బుచ్చన్న పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:59 PM