‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 15 , 2025 | 10:57 PM
భూభారతి పథకాన్ని ప్రతీ రైతు వినియోగించుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు.
- ఆర్డీవో శ్రీనివాసరావు
ఇటిక్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): భూభారతి పథకాన్ని ప్రతీ రైతు వినియోగించుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఇ టిక్యాల మండలంలోని మునుగాల గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు హాజరై మా ట్లాడారు. భూభారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయ న్నారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేశామని, ప్రతీ గ్రామంలో రెవె న్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు భూ సమస్యలు దరఖాస్తులను తీసుకుంటున్నట్లు తె లిపారు. మునుగాల గ్రామంలో 54 దరఖాస్తు లు వచ్చాయని ఇందులో 13 మందికి నోటీసు లు ఇచ్చామని, పట్టాదారు పేరు మార్పుకు ఆ రు, ఓఆర్‌సీకి రెండు, ఇతర సమస్యలపై 30, సాదాబైనామా దరఖాస్తులు 15 వచ్చాయని త హసీల్దార్ వీరభద్రప్ప తెలిపారు. కార్యక్రమంలో ఎర్రవల్లి తహసీల్దార్ నరేష్, నయాబ్ తహసీ ల్దార్ నందిని, రెవెన్యూ సిబ్బంది మనోహర్, మ ధుమోహన్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 10:57 PM