ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:25 PM

పరిసరాల పరిశుభ్రతకు ప్రతీ ఒ క్కరూ సహకరించాలని కోస్గి మునిసిపల్‌ కమిషనర్‌ నాగ రాజు ప్రజలను కోరారు.

పేట మునిసిపాలిటీలో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్న ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ భరత్‌

- కోస్గి మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు

కోస్గి/నారాయణపేట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతకు ప్రతీ ఒ క్కరూ సహకరించాలని కోస్గి మునిసిపల్‌ కమిషనర్‌ నాగ రాజు ప్రజలను కోరారు. మంగళవారం వందరోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ చేపట్టారు. త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, తడి చెత్త నుంచి ఎరువును తయారు చేయడంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వాడకుండా బ ట్ట సంచుల వాడకం, నీటి సరఫరాపై ప్రజలకు వివరించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. కార్యక్రమం లో మునిసిపల్‌, మెప్మా సిబ్బంది, కాలనీవా సులు పాల్గొన్నారు.

అదేవిధంగా, నారాయణపేట మునిసిపాలిటీ పరిధిలో మునిసిపల్‌ సిబ్బంది తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ భోగేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చెన్నకేశవులు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ భరత్‌ మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్‌ను వాడకుండా బట్ట సంచులు ఉపయోగించాలన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:25 PM