‘ఉపాధి’ కూలీలకు అందని వేతనాలు
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:28 PM
ఉపాధి హామీ పథకం అమలు తీరుపై కూలీలు పెదవి విరుస్తున్నారు. ఉపాధి కల్పన తగ్గిపోవడంతో పాటు, చేసిన పనికి వేతనాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- రూ. 4.90కోట్ల వేతనాలు పెండింగ్
- రెండు నెలలుగా ఎదురు చూపులు
- ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- పని దినాలలో ఇప్పటి వరకు 30 శాతమే పూర్తి
గద్వాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం అమలు తీరుపై కూలీలు పెదవి విరుస్తున్నారు. ఉపాధి కల్పన తగ్గిపోవడంతో పాటు, చేసిన పనికి వేతనాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలలకు సంబందించి దాదా పు రూ.4.98 కోట్ల వేతనాలు కూలీలకు చెల్లించా ల్సి ఉంది. ఉపాధి హామీ అధికారులు ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్)లను జనరేట్ చేసినప్పటికీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.
4.38 లక్షల పని దినాలు పూర్తి
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు అంద డం లేదు. కూలీలు ఈ ఏడాది ఇప్పటి వరకు 4.38 లక్షల పని దినాలు పూర్తి చేశారు. అందుకోసం వారికి రూ.14.85 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 9.87 కోట్లు మాత్రమే చెల్లించింది. మే నెల నుంచి వే తనాలు పెండింగ్‌లో ఉన్నాయి. 467 ఎఫ్‌టీవోల కు సంబంధించిన వేతనాలే రూ.4.98 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరి కొన్ని ఎఫ్‌టీవోలు ఇంకా జనరేట్ కాలేదు. అవి పరిగణలోకి తీసుకుంటే ఇది రూ. 5 కోట్లకు పైగానే ఉంటుందని అంచ నా. రెండు నెలలుగా డబ్బు చేతికి అందకపోవ డంతో కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్లను నిలదీస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో పను లు చేశామని, వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్తున్నారు. ప్రభు త్వం వెంటనే నిధులు మంజూరు చేసి, ఆదుకో వాలని కోరుతున్నారు.
50 శాతం తగ్గిన లేబర్ బడ్జెట్
ఉపాధి హామీ పథకంలో ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు ఎంత మందికి ఉపాధి కల్పిస్తారు, వేతనాలు, మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుందో లేబర్ బడ్జెట్‌ను తయారు చేస్తారు. ఈ ఏడాది దాదాపు 26 లక్షల పనిదినాలకు లేబర్ బడ్జెట్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కానీ దానిని 13.54 లక్షల పని దినాలకు కుదించారు. పని ప్రదేశం ఫొటోలతో కూడిన కూలీల హాజరును నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి 4.38 లక్షల పని దినాలు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాలు కురుస్తుండటం, వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో కూలీలందరు పొలం పనులకు వెలుతున్నారు. దీంతో జిల్లాలో ఇప్పు డు వాచ్ అండ్ వార్డ్ పనులు మాత్రమే జరుగుతున్నాయి.
త్వరలోనే డబ్బులు వస్తాయి
ఏప్రిల్ నుంచి మే 20వ తేదీ వరకు చేసిన పనికి డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆ తర్వాత చేసిన పనికి డబ్బులు రావాల్సి ఉంది. మేము ఎఫ్‌టీఓవోలను జనరేట్ చేసి పంపించాము. త్వరలో కూలీల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.
- నర్సింగరావు, అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఆర్‌డీవో
Updated Date - Jul 23 , 2025 | 11:28 PM