సౌకర్యాల లేమిపై సందర్శకుల అసంతృప్తి
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:35 PM
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కాస్త సేదతీరుదామంటే ఎక్కడా కూర్చునేందుకు నీడ లేదు. ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఎటు చూసినా ముళ్లకంప, ఎండ. అలసిపోయి సౌకర్యాల లేమిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు వద్ద నిలువ నీడ కరువు
- అలసిపోయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పర్యాటకులు
ధరూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లను తిలకించేందుకు ఎంతో ఆసక్తితో వస్తున్నారు సందర్శకులు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు గేట్లు ఎత్తడంతో భారీగా దిగువకు వెళ్తున్న నీటి ప్రవాహాన్ని చూసి సంబరపడుతున్నా రు. నీటిలోకి దిగి సెల్ఫీలు తీసుకుంటూ, స్నేహి తులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతు న్నారు. ఈ సంతోషాన్నంతా సెల్‌ఫోన్లలో బం ధించి రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఎండను కూడా మరిచిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అనంతరం కాస్త సేదతీరుదామంటే ఎక్కడా కూర్చునేందుకు నీడ లేదు. ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఎటు చూసినా ముళ్లకంప, ఎండ. అలసిపోయి సౌకర్యాల లేమిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో వస్తున్న వారంతా పర్యాట కంపై ఇటు అధికారులు, స్థానిక నాయకులు సైతం పట్టించుకోకపోవడంపై అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభు త్వాలు ఎన్నిసార్లు హామీ ఇచ్చినా నేటికీ అమలుచేయలేదు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణం, సేద తీరేందు కు రూములు సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.15కోట్ల వ్యయంతో పను లు ప్రారంభమైనా పూర్తి చేయలేదు. ప్రధాన కాల్వల వద్ద, ప్రమాద స్థలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పర్యాటకంపై దృష్టి సారించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:35 PM