రేపు గ్రామపాలన అధికారుల పరీక్ష
ABN, Publish Date - May 23 , 2025 | 11:03 PM
ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రామపాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
- హాజరుకానున్న 152 మంది అభ్యర్థులు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 23 (ఆంధ్రజ్యోతి) : ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రామపాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామపాలన అధికారుల పరీక్ష నిర్వహణపై సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని చైతన్య హైస్కూల్‌లో నిర్వహించే ఈ పరీక్షకు 152 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు కొనసాగుతుందని, పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, గుర్తింపు కోసం పనిచేస్తున్న కార్యాలయ అధికారి జారీ చేసిన ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు తీసుకరావాలన్నారు. హాల్ టికెట్‌పై ఉన్న అభ్యర్థి ఫొటోపై సంబంధిత కార్యాలయ అధికారి సంతకం ఉండాలన్నారు. ఎలాంటి వస్తువులను భద్రపరచడానికి క్లాక్ రూమ్ వంటి నిల్వ సౌకర్యం లేదని తెలిపారు. నలుపు నీలం బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో నవీన్, నగరపాలక సంస్థ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ, రూరల్ తహసీల్దార్ సుందర్‌రాజు, డిప్యూటీ నోడల్ అధికారి, ప్రిన్సిపాల్ అనిరుధ్ నటరాజన్, చీఫ్ సూపరింటెండెంట్ మహ్మద్ అహ్మద్ పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 11:03 PM