నేడు అక్షయ తృతీయ
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:33 PM
అక్షయ తృతీయతో పాటు బసవ జయంతి వేడుకలను బుధవారం నారాయణపేట జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు చాలా మంది ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ.
ఈ రోజు బంగారం కొనడం ఆనవాయితీ
తులం ధర రూ.98,600
కొనుగోళ్లపై ప్రభావం చూపనున్న ధరలు
జంకుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు
నారాయణపేట, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయతో పాటు బసవ జయంతి వేడుకలను బుధవారం నారాయణపేట జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు చాలా మంది ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ. అక్షయం అంటే ఎప్పుడూ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే తరిగిపోని సంపదగా ఉంటుందని నమ్ముతారు. అయితే ఈ సారి బంగారం పది గ్రాముల ధర రూ.లక్షకు చేరడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారనుంది.
ధరలు ఇలా: బంగారం ధర ఆకాశాన్నంటింది. తులం బంగారం ధర రూ.98,600గా ఉంది. గత ఏడాది అక్షయ తృతీయ రోజు ధర రూ.71,500గా ఉన్నది. ధర పెరగడంతో అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలన్న మహిళల సెం టిమెంట్‌కు భారంగా మా రింది. మూడు గ్రా ములు కొనాలన్నా రూ.30 వేలకుపైగా వెచ్చించాల్సి వ స్తోంది. కర్ణాట క సరిహద్దులో ఉన్న నారాయణపేట మేలిమి బంగారానికి ప్రసిద్ధి కావడంతో కర్ణాటకతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి బంగారం కొనుగోలు చేయనున్నారు. పెరిగిన ధరలతో విక్రయాలు తగ్గే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:33 PM