ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద పటిష్ట భద్రత

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:14 PM

ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌వద్ద పటిష్ట భద్రత ఏ ర్పాటు చేయాలని, డిప్యూటీ సీఈవో, నోడల్‌ అధికారి హరిసింగ్‌ అన్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద డిప్యూటీ సీఈవో, ఈవీఎం నోడల్‌ అధికారి హరిసింగ్‌, నాయకులు

- డిప్యూటీ సీఈవో, నోడల్‌ అధికారి హరిసింగ్‌

గద్వాల న్యూటౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌వద్ద పటిష్ట భద్రత ఏ ర్పాటు చేయాలని, డిప్యూటీ సీఈవో, నోడల్‌ అధికారి హరిసింగ్‌ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలోని గోదాంలో ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎం)ను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను డిప్యూటీ కలెక్టర్‌ (సీఈవో కార్యాలయం) ఎస్‌.చెన్నయ్య, ఈవీ ఎం కన్సల్టెంట్‌ ప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లు, ప్రవేశ నియమాలు, సీసీ కెమెరాలు, నమోదు పత్రాలు తదితర అంశాలను సమగ్రంగా, క్షణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో హరిసింగ్‌ మాట్లాడుతూ ఈవీఎం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ లోపల, బయట భద్రతా ఏర్పాట్లు పటి ష్టంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుండాలని సూచించా రు. ప్రతీ రికార్డులో అన్ని వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, గద్వాల తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎన్నికల విభాగం సూపరింటెంటెండ్‌ కరుణాకర్‌, సురేశ్‌ తదితరులున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:14 PM