ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తేజేశ్వర్‌ను హత్య చేసిన వారిని ఉరితీయాలి

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:38 PM

తేజేశ్వర్‌ హత్యకు కారకులైన వారిని వెంటనే ఉరితీయాలని, బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని మృతుడు తేజేశ్వర్‌ అక్క రమాదేవి డి మాండ్‌ చేసారు.

గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో ధర్నా చేస్తున్న బంధువులు, మిత్రులు

గద్వాల క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తేజేశ్వర్‌ హత్యకు కారకులైన వారిని వెంటనే ఉరితీయాలని, బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని మృతుడు తేజేశ్వర్‌ అక్క రమాదేవి డి మాండ్‌ చేసారు. ఆదివారం సాయంత్రం హ త్యకు గురైన తేజేశ్వర్‌ ఇంటి నుంచి కుటుంబ స భ్యులు, బంధువులు, మిత్రబృందం ర్యాలీగా బ యలుదేరి కృష్ణవేణి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మృతుడు తేజేశ్వర్‌ అక్క రమాదేవి, అన్న తేజవర్ధన్‌ మాట్లాడుతూ.. తమ తమ్ముడిని ఐశ్వర్య పెళ్లి చేసుకొని ఐశ్వర్యప్రియు డు అయిన తిరుమల్‌రావుతో కలిసి హత్యచేయించడం దారుణమన్నారు. తేజేశ్వర్‌ హత్యకు కారకులైన వారి తరుపున ఓ న్యాయవాది కూ డా వాధించకుండా నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేజేశ్వర్‌ కుటుంబ సభ్యులకు ఉన్న కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఉన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:38 PM