ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జల్సాల కోసం దొంగలయ్యారు

ABN, Publish Date - Mar 15 , 2025 | 11:04 PM

జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు.. దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా మంచి జీవితాన్ని సాగించిన వ్యక్తి అక్కడి నుంచి వచ్చి డబ్బుల కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జానకి, చిత్రంలో నిందితులు

- అమాయక మహిళలను ఆటోలో ఎక్కించుకొని కొట్టి నిలువుదోపిడీ

- రెండు కేసుల్లో రూ.2.80 లక్షల నగలు రికవరీ

- వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు.. దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా మంచి జీవితాన్ని సాగించిన వ్యక్తి అక్కడి నుంచి వచ్చి డబ్బుల కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. మద్యం, అసాంఘీక కార్యకలాపాలకు బానిసలుగా మారి అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి నగలు కాజేసే ముఠా ఎట్టకేలకు పో లీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. రెండు రాబరీ కేసుల్లో రూ.2.80 లక్షల విలువ చేసే నగలు రికవరీ చేశారు. ఎస్పీ జానకి శనివారం సాయంత్రం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహమ్మదాబాద్‌ మండలం చౌడాపూర్‌కు చెందిన కాట్రావత్‌ భరత్‌ దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అక్కడ మంచి జీవితాన్ని వదులుకుని కొన్నాళ్ల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడి డబ్బుకోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ఆటోను అద్దెకు తీసుకుని అతనికి ప్రతిరోజు రూ.300 చెల్లిస్తున్నాడు. తనకు సన్నిహితంగా ఉండే మహిళ హన్వాడ మండలం టంకరకు చెందిన సామె శోభ, కోస్గి మండలం మల్‌రెడ్డిప ల్లికి చెందిన మేస్త్రీ కామారం నరేశ్‌ కలిసి ము ఠాగా ఏర్పడ్డారు. ఈనెల 12న నగరంలోని టీడీ గుట్ట వద్ద అడ్డాకూలి వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు మహిళలను ఎంచుకుని పని కల్పిస్తామని వారిని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. ముందుగా దొడ్డలోనిపల్లి అక్కడి నుంచి మయూరిపార్క్‌ వైపు వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతా నికి ఆటో తీసుకెళ్లి ముగ్గురు కలిసి ఇద్దరు మహిళలను చితకబాది వాళ్ల ఒంటిపై ఉన్న వెండి కడియాలు, బంగారు నగలు అపహరించి పరారయ్యారు. ఈనెల 13న కామారం నరేశ్‌ ఒక్కడే టీడీగుట్ట అడ్డాకూలి వద్దకెళ్లి ఓ మహిళకు పని కోసం అని చెప్పి వెంట తీసుకెళ్లాడు. భూత్పూర్‌ వైపు వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెను కొట్టి పుస్తెలతాడు, కడియాలు అపహరించారు. ఈ రెండు కేసులలో బాధితులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ అప్పయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులు తెలివిగా ఆటోలకు ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చిన నెంబర్‌ ఉన్న టాప్‌ను తొలగించి మరో టాప్‌ వేసుకుని ఆటో నడిపిస్తున్నా రు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాధితులు చెప్పిన సమయంలో వెతికారు. అనుమా నాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించిన పోలీ సులు వారిని అదుపులోకి తీసుకుని విచారించ గా నేరస్థులు చేసిన నేరాలను అంగీకరించారు. వారినుంచి రూ.2.80 లక్షల విలువ చేసే వెండి, బంగారు నగలను అపహరించారు. నిందితుల ను కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య, ఏఎస్‌ఐ ఆరిఫ్‌నవాజ్‌, పవన్‌కు మార్‌, నిజాంను ఎస్పీ అభినందిస్తూ నగదు రివార్డ్‌ అందజేశారు. అడిషినల్‌ ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:04 PM