భర్తను చంపించిన భార్య
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:25 PM
వివా హేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య హత్య చేయించిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.
వనపర్తి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : వివా హేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య హత్య చేయించిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. శనివారం విలేకరు లకు పూర్తి వివరాలు తెలియజేశారు. పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త సూగూరుకి చెందిన జూదం సునీత తన భర్త జూదం రవి కనిపించడంలేడని గత నెల 19న పెబ్బేరు పో లీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రి 8:30కు గ్రామ సమీపంలో రవి మృతదేహం కనిపిం చింది. జూదం సునీత అనుమానితులైన నరే ష్, అరవింద్‌లపై ఫిర్యాదు చేసింది. కేసును ద ర్యాప్తు చేసుకొని విచారణలో భాగంగా రవిని భార్యనే హత్య చేయించినట్లు కీలక విషయా లు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. సునీత కొంతకాలంగా నరేష్ అనే మేస్ర్తీ వద్ద పని చేస్తున్న క్రమంలో అక్కడే పని చేస్తున్న శ్రీరంగాపూర్‌కి చెందిన అరవింద్‌తో వివాహే తర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సునీ త భర్తకు తెలిసి అరవింద్‌ను పలుమార్లు హె చ్చరించాడు. ఇది మనసులో పెట్టుకొని సునీత తన భర్త అడ్డు తొలగించుకోవాలని అరవింద్‌కి చెప్పింది. ఈ విషయాన్ని ఆయన తన స్నేహి తులైన భగవంతు, గిరికి చెప్పడంతో వారు ఈ విషయానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. గత నెల 19న అరవింద్ తన స్నేహితుడైన సూ గూరుకు చెందిన భాషా కారు తీసుకొని అవసరం నిమిత్తం తన స్నేహితులైన అయ్య వారిపల్లికి చెందిన భగవంతు, గిరిని కారులో ఎక్కించుకుని దారిలో వెంకటాపురం వద్ద తా గడానికి మద్యం, కవరును కొనుగోలు చేశాడు. ఆంజనేయులుతో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారు అనుకున్న ప్రకారం రవికి మద్యం తాగించి ముఖానికి ప్లా స్టిక్ కవర్లు చుట్టి ఊపిరాడకుండా హత్య చేశా రు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదే హాన్ని గ్రామ సమీపంలో ఉంచి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితులైన అరవింద్, సునీత, భ గవంతు, గిరి, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 11:25 PM