ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - May 30 , 2025 | 11:16 PM

అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి అన్నారు.

మద్దూర్‌లో కాడా అఽధికారితో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కునందిస్తున్న తిరుపతిరెడ్డి

- కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి

కోస్గి/మద్దూర్‌/కొత్తపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి అన్నారు. కోస్గి మండలంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు గుండుమాల్‌ మండలంలోని రైతువేదిక కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా, మద్దూర్‌ రైతువేదికలో కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వీటితో పాటు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల నిఽధులు మంజూరు చేశారన్నారు. అనంతరం కొత్తపల్లి మండలంలో కూడా చెక్కులు పంపిణీ చేశారు. కాడా అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, ఆయా మండలాల పార్టీ అధ్యక్షు లు రఘువర్ధన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, మద్దూర్‌, కొత్తపల్లి తహసీల్దార్లు మహేశ్‌గౌడ్‌, జయరాములు, మద్దూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పీఏసీఎస్‌ అఽధ్యక్షుడు నర్సింహా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్‌, పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:16 PM