ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

ABN, Publish Date - May 08 , 2025 | 11:52 PM

కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిం చాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు.

గోప్లాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

పెంట్లవెల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిం చాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు. గురు వారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండ లంలోని జట ప్రోలు, గోప్లాపూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొ నుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు తీసుకు వచ్చిన ధాన్యం నిబంధన ప్రకారం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేయాలన్నారు. తూకం వేసిన ధాన్యా న్ని వెంటనే మిల్లర్లకు తరలించా లని నిర్వాహకులను ఆదేశించారు. ఎంగంపల్లి తండాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. అదేవిధంగా పెంట్లవెల్లి తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్థు లు తమ భూ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టం అమలులో భాగంగా భూ సమస్యల పరి ష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. భూ సమస్యలు ఉన్న వారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆర్జీలు సమ ర్పించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అనంత రం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ ఆర్డీవో బన్సీ లాల్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:52 PM