యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి
ABN, Publish Date - Jun 19 , 2025 | 10:48 PM
పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
- సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా
పాలమూరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, మాస్‌లైన్ కార్యదర్శి సీహెచ్ రాంచందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై ఆంక్షలు పెడుతూ యుద్ధ మదాన్ని పెంచి పోషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఆయుధాలను అమ్ముకోవటానికి పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధాలను ప్రోత్సహిస్తూ యుద్ధం బీభత్సం సృష్టిస్తున్నారని ట్రంప్ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. పాలస్తీనా భూ భాగాన్ని ఆక్రమించుకోవటం అన్యాయం, అక్రమమని పాలస్తీనా జాతీని నిర్మూలించాలని అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ పెట్రేగిపోతుందన్నారు ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం ఉపసంహరించుకోవాలని ట్రంప్-మోదీ ఇద్దరూ దొందు దొందేనని విమర్శించారు. జీ7 దేశాలు నాటో కూటమి పేరుతో ఇతర దేశాలపైన అమెరికా పెత్తనం, వ్యాపారం పేరుతో దేశాలను ఇబ్బంది పెట్టడం వర్థమాన దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాద దోపిడిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరద గాలెన్న, ఖమర్‌అలీ, రాము, రంగన్న, వెంకటయ్య, బుచ్చన్న, దేవదానం, సాంబశివుడు, బాలు పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 10:48 PM