జోగుళాంబ అమ్మవారి ఆలయ పరిసరాలు అపరిశుభ్రం
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:30 PM
దక్షిణకాశీగా పేరొందిన అలంపూరు ఆలయా లు దేశంలోనే ప్రఖ్యాతి గాంచినవి. కానీ ఇక్కడి ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని తనంవల్ల ఆలయ పరిసరాలు అపరిశు భ్రంగా మారాయి.
అలంపూరుచౌరస్తా, జూలై18 (ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా పేరొందిన అలంపూరు ఆలయా లు దేశంలోనే ప్రఖ్యాతి గాంచినవి. కానీ ఇక్కడి ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని తనంవల్ల ఆలయ పరిసరాలు అపరిశు భ్రంగా మారాయి. జోగుళాంబ అమ్మవారి దర్శ నానికి క్యూలైన్లలో భక్తుల కోసం వెళ్లేచోట వచ్చే దారుల్లో తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశా రు. కానీ వీటి నిర్వహణ లేక పాకరపట్టి దప్పిక తీర్చడం దేవుడెరుగు కానీ ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. అమ్మవారి ఆలయ ప శ్చిమద్వారం వద్ద రోడ్డుపై నిలిచిన నీరు మడు గును తలపిస్తున్నది.
Updated Date - Jul 18 , 2025 | 11:30 PM