ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమ్మెను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jul 07 , 2025 | 11:05 PM

ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్‌ కార్మికులకు పిలుపునిచ్చారు.

జడ్చర్లలో సీఐటీయూ నాయకుల జీపుజాత

పాలమూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావటం సరికాదన్నారు. నాలుగు కోడ్‌ల ద్వారా రెగ్యులర్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లనుందన్నారు. నాలుగు కోడ్‌లు అమలైతే 300 మంది లోపు కార్మికులు పనిచేసే కంపెనీ, పరిశ్రమలో సంస్థ యజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే యథేచ్చగా కార్మికులను తొలగించవచ్చన్నారు. రైస్‌మిల్‌ సంఘం అధ్యక్షుడు దాసు, శేఖర్‌, ఆంజనేయులు, కృష్ణయ్య, బుజ్జి, వెంకటయ్య పాల్గొన్నారు.

సమ్మెను బలపరచాలి..

ఈనెల 9న దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెను బలపరచాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ యం.రాఘవాచారి సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, యంత్రాలలో యంత్రాలుగా పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల పని గంటలు పెంచటం సరికాదన్నారు. నాలుగు లేబర్‌కోడ్‌ల పేరుతో కేంద్రం తీసుకొచ్చిని జీవోను రద్దు చేసి, పని గంటలు ఆరు గంటలకు తగ్గించాలన్నారు.

జడ్చర్ల : దేశ వ్యాప్తంగా ఈనెల 9న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్‌, సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య పిలుపునిచ్చారు. మునిసిపల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ జీపు జాతాను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన లేబర్‌ కోడ్‌లతో కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారని, అన్యాయం జరిగితే అడిగే హక్కు ఉండదన్నారు. రోజుకు 8 గంటలు కాకుండా 10-12 గంటలు పనిచేయాలని చెప్పటం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవోనెంబర్‌ 282ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీపుజాతను పోలెపల్లి సెజ్‌, జడ్చర్ల, గంగాపురం, మాచారం ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జగన్‌, కృష్ణ, మహేష్‌, విద్యాసాగర్‌, కిరణ్‌. నరసింహులు, అలివేల, యాదమ్మ, ఆశవర్కర్లు సావిత్రి, సుగుణ, దమయంతి, జమయ్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:05 PM