ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు జాడ తెలిసే వరకు గాలింపు

ABN, Publish Date - May 18 , 2025 | 11:02 PM

భీమా నది లో ఫుట్‌బాల్‌ మరమ్మతులు చేయడానికి నీటిలో దిగి మొసలి బారిన పడిన రైతు జింకల తిప్పన్న జాడ తెలిసే వరకు రిస్క్‌ టీం గాలింపు కొనసాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితరులు

కృష్ణ, మే 18 (ఆంధ్రజ్యోతి): భీమా నది లో ఫుట్‌బాల్‌ మరమ్మతులు చేయడానికి నీటిలో దిగి మొసలి బారిన పడిన రైతు జింకల తిప్పన్న జాడ తెలిసే వరకు రిస్క్‌ టీం గాలింపు కొనసాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కుసుమూర్తి గ్రామ భీమా నది ఒడ్డున సంఘటన స్థలానికి ఆయనతో పాటు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించి, కుటుంబ సభ్యులు, గ్రా మస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకు న్నారు. ఆ తర్వాత ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. రైతును అన్నివిధాలుగా ప్రభు త్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని, రేపట్నుంచి ఘటనా స్థలంలో రిస్క్‌ టీంతో గాలింపు చర్యలు చేపడతామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

వరద కారణంగా మొసళ్ల తాకిడి

2009 సంవత్సరంలో కృష్ణ, భీమా నదు లకు భారీ వరద రావడం వల్లనే నీటి గుంతల్లో, బావుల్లో, వాగుల్లో మొసళ్లు ఆవాసా లు చేసుకుని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి పెంచుకోవడం వల్ల నేడు రోడ్లపై తచ్చాడు తూ పశువులు, కుక్కలు, గొర్రెలు, మనుషులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ఫారెస్టు అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - May 18 , 2025 | 11:02 PM