భూభారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం
ABN, Publish Date - May 26 , 2025 | 11:13 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- శిక్షణ పొందిన వారు రైతులకు న్యాయం చేయాలి
- లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ప్రారంభం
నారాయణపేట టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర సమీపంలోని సింగారం వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో లైసెన్స్ సర్వేయర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగ లైసెన్స్‌డ్ సర్వే శిక్షణ పొందేందుకు జిల్లాలో ఐటీఐ, సివిల్, ఇంజనీరింగ్ చేసిన నిరు ద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 109 లైసెన్స్ సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు అనుభవజ్ఞులైన వారిచే సర్వే, శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి, హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులపై తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో చాలా స ర్వే సమస్యలు ఉన్నాయని, ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భూ సర్వేలకు సంబంధించిన వినతులే ఉంటున్నా యని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో కేవలం 5 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, ప్రతీ మండలానికి వారు వెళ్లడం చాలా కష్టంగా మారిందన్నారు. ఈ భూ సర్వే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని మనం కూడా అమలు చేస్తున్నామన్నారు. భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి గెట్టు తగాదాలు లేకుండా ఉండేందుకు గాను, హద్దులను కాపా డేందుకు గాను సర్వేయర్ల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చ ట్టం ప్రారంభిం చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూములు లావాదేవీలు జరిగినప్పుడు సర్వే చేసి హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తరువాత రిజిస్ర్టేషన్లు జరుగుతాయని దీనివల్ల తగాదాలకు చోటు ఉండదని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగులు ఈ ట్రైనింగ్ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో మొదటి బ్యాచ్ 109 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి, పాస్ అయిన వారికి సర్టిఫికె ట్ ఇస్తామన్నారు. అనంతరం శిక్షణ మెటీరియల్‌ను కలెక్టర్ అందజేశారు. జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐలు థాను, తయ్యబ్, సుల్తానా, సర్వే యర్లు రంగయ్య, జయశంకర్, కృష్ణయ్య, రవి, రాజన్న, అరుణ తదితరులున్నారు.
Updated Date - May 26 , 2025 | 11:13 PM