కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 10:52 PM
సహకార సంఘం ఆధ్వర్యంలో మద్దూర్‌లో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- మద్దూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
మద్దూర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘం ఆధ్వర్యంలో మద్దూర్‌లో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలు, ధాన్యం తేమ శాతాన్ని ఆమె పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లుకు రవాణా చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రం చేసేందుకు ప్యాడీ క్లీనర్‌ను, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అలాగే పల్లెగడ్డలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలం, తహసీల్దార్ మహేష్‌గౌడ్, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహ తదితరులున్నారు.
Updated Date - Apr 16 , 2025 | 10:52 PM