ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

ABN, Publish Date - Jul 23 , 2025 | 11:43 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ బి.ఎం సంతోష్‌ ఆదేశిం చారు.

మల్దకల్‌ పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌

మల్దకల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ బి.ఎం సంతోష్‌ ఆదేశిం చారు. బుధవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లోని ప్రాథ మిక ఆర్యోగ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం లో అందుతున్న వైద్యసేవలపై సిబ్బందిని అడి గి తెలుసుకున్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యే క దృష్టి సారించాలన్నారు. హైరిస్క్‌ ఉంటే గు ర్తించి తగిన వైద్యజాగ్రతలు తీసుకోవాలని సూ చించారు. సహజ ప్రసవాలు సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రక్తపరీక్షలు, మూత్ర, ఇతర పరీక్షలను వేగంగా పూర్తి చేసి తక్షణ రోగనిర్ణయం చేయాలని అన్నారు. గర్భి ణుల కోసం ఏర్పాటు చేస్తున్న యోగా కేంద్రం భవన నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆధికారి డాక్టర్‌ సిద్దప్ప, డాక్టర్‌ స్వరూప రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • ఎరువులు, విత్తనాల కొరత రానివ్వొద్దు

మల్దకల్‌లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూ చించారు. గోదాంలోని స్టాక్‌ను పరిశీలించారు. నిర్వహణ పకడ్బందీగా ఉండాలని చెప్పారు. ప్రతీ రైతునుంచి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకుని ఎరువులు, విత్తనాలు విక్రయించాలని ఆదేశించారు. అనంతరం ఆ పక్కనే ఉన్న పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో స్టాక్‌ను, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ జిల్లా కోఆపరేవ్‌ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్‌ ఝాన్సీ రాణి పీఏసీ ఎస్‌ అధ్యక్షుడు తిమ్మరెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, రైతులు ఉన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:43 PM