ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మిక, కర్షక సమ్మెను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jun 05 , 2025 | 11:33 PM

ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న కార్మి క, కర్షక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌

- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌

నారాయణపేట, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న కార్మి క, కర్షక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్‌ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను సవరించి కొన్నింటిని రద్దు చేసి యజ మానులకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసు కొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ముందుగా మే 20న దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వగా పహల్గాంలో ఉగ్ర ఘటన, ఆ తర్వాత భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణంతో సమ్మెను ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్మిక, కర్షకులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, బాల్‌రామ్‌, ఆంజనేయులు, గోవింద్‌రాజ్‌, కాశీనాథ్‌, బాలమణి, సాయిలు, కృష్ణ ఉన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:33 PM