వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన
ABN, Publish Date - May 04 , 2025 | 11:34 PM
బొడ్రా యి, పోచమ్మ గ్రామదేవతల పునఃప్రతిష్ఠోత్స వం కనుల పండువగా నిర్వహించారు.
- బొడ్రాయి, పోచమ్మ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
- భారీగా తరలివచ్చిన భక్తులు
అచ్చంపేట, మే 4 (ఆంధ్రజ్యోతి) : బొడ్రా యి, పోచమ్మ గ్రామదేవతల పునఃప్రతిష్ఠోత్స వం కనుల పండువగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివా రం ఉదయం బొడ్రాయి ప్రాణప్రతిష్ఠ చేశారు. జలాభిషేకం చేసేందుకు భక్తులు క్యూకట్టారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు గ్రామ దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని బొడ్రాయి, పోచమ్మ దేవతల పునఃప్రతిష్ఠమహోత్సవానికి బంధు మిత్రులు అధిక సంఖ్యలో తరలిరావడంతో అచ్చంపేటలోని గోకుల్‌నగర్, సాయినగర్, ఇందిరానగర్, టంగాపూర్ కాలనీలతో పాటు పలు కాలనీలు భక్తులతో కళకళలాడాయి.
అష్ట దిగ్బంధనంలో అచ్చంపేట
బొడ్రాయి ప్రతిష్ఠమహోత్సవం ముగిసిన తదుపరి ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం 6 గంటల వరకు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. పట్టణంలోని కోటమైస మ్మ దేవత కల్యాణం అనంతరం ప్రత్యేక పూజలు చేసి పట్టణం చుట్టూ పొలి చల్లారు. ఈ సందర్భంగా పట్టణానికి వచ్చే దారులన్నీ బంద్ చేశారు.
అమ్మవార్లను దర్శించుకున్న నాయకులు
గ్రామ దేవతలలో ప్రధానమైన బొడ్రాయి, పోచమ్మ దేవతల ప్రాణపతిష్ఠ అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మునిసి పల్ చైర్మన్ శ్రీనివాసులు, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత, బీజేపీ నాయకులు పోతుగంటి భరత్ ప్రసాద్‌తో పాటు మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మాజీ మునిసిపల్ చైర్మన్ నర్సిం హ్మ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు దర్శించుకు న్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - May 04 , 2025 | 11:34 PM