సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:12 PM
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, పేట ఎమ్మె ల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
- పేట ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మద్దూర్/కొత్తపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, పేట ఎమ్మె ల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురువారం మద్దూర్ మండలంలోని మోమినాపూర్, బండ గుండ, మోమినాపూర్-బొమ్మన్‌పాడ్ రోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, మద్దూర్‌లోని ప్రాథమిక పాఠ శాల, అంగన్‌వాడీ నూతన భవనాలను వారు ప్రారంభించి, మాట్లాడారు. కాడా అధికారి వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, శివారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్, రవీందర్‌రెడ్డి, హన్మిరెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ తదితరులున్నారు. అదేవిధంగా, కొత్తపల్లి మండలం లోని అల్లీపూర్ గ్రామంలో దుప్పట్టి ఘట్టు నుంచి అల్లీపూర్ వరకు, అలాగే గోకుల్‌నగర్ నుంచి అల్లీపూర్ గ్రామానికి రూ.8.93 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు తిరుపతిరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్లీపూర్ గ్రామస్థులు బీటీ రోడ్డు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పనుల ప్రారంభానికి వచ్చిన తిరుపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డీఈ విలోక్, నాయకులు రమేష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌యాదవ్, నరేష్‌యాదవ్, వెంకట్ తదితరులున్నారు.
రాష్ట్ర స్థాయి ర్యాంకర్‌కు సన్మానం
కోస్గి రూరల్ : ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన కోస్గికి చెందిన మూలింటి సాత్విక్‌ను కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సన్మానించారు. గురువారం స్థానిక శ్రీలక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు.
Updated Date - Apr 24 , 2025 | 11:12 PM