ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Mar 29 , 2025 | 11:06 PM

ప్రభు త్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించి, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకుంటున్న చిన్నారెడ్డి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి వైద్యవిభాగం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించి, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా జనరల్‌ ఆస్పత్రిని అక స్మికంగా తనిఖీ చేశారు. రెండు గంటల సమయం ఆస్పత్రి లో గడిపిన ఆయన ప్రతీ వార్డును పరిశీలించారు. స్టాఫ్‌ నర్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎన్ని వైద్య పోస్టులు, స్టాఫ్‌ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరాలు సేకరించారు. అనంతరం సెక్యూరిటీ, శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌ కార్మికులతో మాట్లాడి వేతనాల చెల్లింపు ప్రక్రి య ఎలా జరుగుతోందని, నెలకు ఎంత వేతనం పొందుతు న్నారని, సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా జమ అవుతుందా అని అడిగి తెలుసు కున్నారు. డైన్‌ నాణ్యతను కొనసాగించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు అసౌకర్యంగా ఇబ్బంది పడుతున్నా రా.. అని సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోలను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జోగు శాంతన్న, నందిమల్ల యాదయ్య, ఎండీ బాబా, జిల్లెల ప్రవీణ్‌కుమార్‌, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:06 PM