మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:38 PM
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. భూత్పూర్ మునిసిపాలిటీలోని కేవీఎన్ ఫంక్షన్‌హాల్‌లో మునిసిపల్ కమిషనర్ నురూల్ నజీబ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు బుధవారం ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
భూత్పూర్, జూలై 2(ఆంధ్రజ్యోతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. భూత్పూర్ మునిసిపాలిటీలోని కేవీఎన్ ఫంక్షన్‌హాల్‌లో మునిసిపల్ కమిషనర్ నురూల్ నజీబ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు బుధవారం ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు నడుపుకోడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు అవకాశం ఇచ్చారన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను సంఘాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు సంఘంలో ఎవరైనా సభ్యురాలు మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల బీమాను అందిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్ తప్పిదం వల్ల రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం లభించలేదని ధ్వజమెత్తారు. భూత్పూర్ మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా భూత్పూర్ మహిళా సంఘాలకు రూ.కోటి చెక్కును అందించారు. అక్కడే మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్‌పెస్టివల్ స్టాళ్లను ఎమ్మెల్యే దంపతులు పరిశీలించారు. సంఘాలను ప్రోత్సహిస్తున్న కమిషనర్ నూరుల్ నజీబ్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు మునిసి పాలిటీ కార్మీకులకు రెయిన్ కిట్లను అందించారు. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల, మద్ధిగట్ల గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కీ నవీన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 11:38 PM