ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:06 PM
మహిళలు ఆర్థికంగా ఎదగడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.
- అదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
- మహిళల సహకారం లేనిదే అభివృద్ధి లేదు
- త్వరలోనే మిగతా మండలాల మహిళా సమాఖ్యలకు బస్సులు ఇస్తాం: కలెక్టర్ విజయేందిర బోయి
- జడ్చర్లలో ఇందిరమ్మ మహిళా శక్తి నియోజకవర్గ సంబురాలు
జడ్చర్ల, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆర్థికంగా ఎదగడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. అన్ని రంగాలలో మహిళలు ముందున్నారని, మహిళల సహకారం లేకుంటే అభివృద్ధి లేదని చెప్పారు. జడ్చర్ల పట్టణంలోని చంద్రా గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన జడ్చర్ల నియోజకవర్గ ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాలలో ఎమ్మెల్యే, కలెక్టర్ విజయేందిర బోయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు బస్సులను ఇచ్చామని, వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు. జడ్చర్లకు బైపాస్ రోడ్డు ఎంతో అవసరమని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తికి నిధులు కేటాయించాలని, పాఠశాలలు మరమ్మతుకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరానని వెల్లడించారు. మహిళలను కించపరిస్తే స హించేది లేదని హెచ్చరించారు. జడ్చర్ల మునిసిపల్ చైర్‌పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ నాయకులు చెడుగా రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల మునిసిపాలిటీలో వర్షం పడితే డ్రైనే జీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రూ.15 కో ట్లు మంజూరు అయ్యాయని, అదనంగా మరో రూ.10 కోట్లు అవసరమని, ఆ నిధులను మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ ప్రభుత్వం జడ్చర్ల, నవాబ్‌పేట మండల మహిళా సమాఖ్యలకు బస్సులను ఇచ్చిందని, త్వరలోనే మిగతా మండలాలకు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని 2,970 మహిళా సంఘాలకు రూ.3,36,17,896 వడ్డీ లేని రుణాల చెక్కును సమాఖ్య అధ్యక్షులకు అందించారు. జడ్చర్ల, నవాబ్‌పేట మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చినందుకు వచ్చిన రూ.1,38,936 చెక్కును, లోన్ భీ మా రూ.18.23 లక్షల చెక్కును, ప్రమాద భీ మాకు సంబందించిన రూ.30 లక్షల చెక్కులను ఇచ్చారు. అనంతరం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు 200 కుట్టుమిషన్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, బాద్మి శివకుమార్, మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:06 PM