ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

ABN, Publish Date - Mar 11 , 2025 | 11:01 PM

జనరల్‌ ఆసుపత్రిలో పనిచేసే కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు.

సూపరింటెండెంట్‌ను సన్మానిస్తున్న కార్మికులు

- జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : జనరల్‌ ఆసుపత్రిలో పనిచేసే కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. మంగళవారం శానిటేషన్‌ ఏజెన్సీ కాంట్రాక్టరు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఆసుపత్రిలో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని, వారికి సకాలంలో వేతనాలు వచ్చేలా కూడా చూస్తున్నామన్నారు. అయితే వారికి రావలసిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ క్రమంలోనే కాంట్రాక్టరును పిలిపించి చర్చించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వారికి పీఎఫ్‌ రూ.500 వరకు పెంచేందుకు కాంట్రాక్టర్‌ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఇకపై ప్రతినెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీల్‌, సాయి సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి, రాఘవేందర్‌, ఏఐటీయూసీ యూనియన్‌ నాయకులు సురేష్‌, రంగన్న, మొగులయ్య, యాదయ్య, అంజి, రాఘవేందర్‌, సత్యమ్మ, వరలక్ష్మి, పద్మ, అంజమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:01 PM