సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
ABN, Publish Date - May 11 , 2025 | 11:03 PM
అఖిల భారత ఐక్య రైతు (ఏఐ యూకేఎస్) జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు భగవంతు అ ధ్యక్షతన నిర్వహించారు.
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము
నారాయణపేట న్యూటౌన్, మే11 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత ఐక్య రైతు (ఏఐ యూకేఎస్) జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు భగవంతు అ ధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారత ఐక్య వేదిక రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము హాజరై మాట్లా డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల ను తీసుకురావడాన్ని నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల జాతీయ స్థాయి పిలుపులో భాగంగా ఈ నెల 20 తేదీన జరిగే సార్వత్రిక సమ్మె, గ్రా మీణ భారత్ బంద్‌ను జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. 16, 17, 18న జిల్లాలో కర పత్రాల ప్రచారం, వీధి మీటింగ్‌లు నిర్వహించి ప్రచారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యాదగిరి, వెంకట్‌రెడ్టి, చెన్నారెడ్డి, కృష్ణ, కొండ నర్సింహులు, నారాయణ, ఆనంద్, రాములు, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:03 PM