విద్యతోనే విద్యార్థుల భవిష్యత్
ABN, Publish Date - May 25 , 2025 | 11:21 PM
విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ అని అవోపా జిల్లా అధ్యక్షుడు, సీసీకుంట ఎంఈవో మురళీకృష్ణ అన్నారు.
- ముగిసిన వేసవి శిక్షణ తరగతులు
జడ్చర్ల, మే 25 (ఆంధ్రజ్యోతి) : విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ అని అవోపా జిల్లా అధ్యక్షుడు, సీసీకుంట ఎంఈవో మురళీకృష్ణ అన్నారు. జడ్చర్ల అవోపా ఆధ్వర్యంలో పట్టణంలోని ఉదయ మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ దిశగా ప్రతీ విద్యార్థి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు ఉపాధ్యాయులను అవోపా సభ్యులు శాలువాతో సత్కరించారు. అవోపా నాయకులు మురళీకృష్ణ, శివకుమార్, తిరుపతి, తిమ్మాజీపేట ఎంఈవో సత్యనారాయణశెట్టి పాల్గొన్నారు. అదే విధంగా జడ్చర్ల మునిసిపాలిటీలోని నాగసాలలో బాలకిష్టయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ రాంరెడ్డి, వైస్‌చైర్మన్ కిల్లెగోపాల్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్‌లను ప్రదానం కార్యక్రమంలో కౌన్సిలర్ నవనీత, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జగన్, వెంకటయ్య, లక్ష్మయ్య, కృష్ణ, యాదయ్య, జయరాం, సాయిలు, ఐద్వా మహిళ సంఘం నాయకులు సుజాత, నందిని, సంధ్యారాణి, లావణ్య, పుష్ప, కృష్ణవేణి, మధులత, రాధిక పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 11:21 PM